భారతదేశం, ఏప్రిల్ 5 -- Son Killed Father: హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. మాదకద్రవ్యాల Drug Addiction వినియోగానికి అలవాటు పడిన తనయుడు ఏకంగా తండ్రినే హతమార్చాడు. చిన్న వయసులోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసగా మారిన తనయుడు చివరకు కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై తలపై రాయితో మోదీ హత్య చేశాడు. హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్ల Adibhatla పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కయంజాల్‌ ప్రాంతంలో గురువారం జరిగింది.

పోలీసులు, బాధితులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన తిరుపాటి రవిందర్‌ ravinder నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో చాలా కాలం క్రితం స్థిరపడ్డాడు. నగరంలో స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.రవిందర్‌ మొదటి భార్య చనిపోవడంతో సుధ అనే మహిళను రెండో ప...