Hyderabad, మార్చి 7 -- Sobhita Dhulipala: టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తండేల్ మూవీ సక్సెస్ తర్వాత ప్రస్తుతం చైతూ కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడు. దీంతో ఈ కపుల్ విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లింది. ఈ సందర్భంగా శుక్రవారం (మార్చి 7) శోభిత ఆ ఫొటోలను షేర్ చేసింది.

నాగ చైతన్య, శోభిత నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలనే శోభిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. వైబ్స్ అనే సింపుల్ క్యాప్షన్ తో వీటిని అభిమానులతో పంచుకుంది.

ఇందులో ఓ అందమైన సెల్ఫీతోపాటు ఓ కెఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫొటో, చేతికి మెహెందీ ఉన్న పిక్, ఓ టిఫిన్ బాక్స్ లో ఉల్లిపాయ సమోసాలు ఉన్న ఫొటో, ఓ లైవ్ రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్న వీడియో కూడా ఉండటం విశేషం. ...