భారతదేశం, మార్చి 9 -- Small savings schemes : ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి.. వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ఫలితంగా.. 2024 జూన్ 30 వరకు వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

"ఏప్రిల్ 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు ముగిసే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి 1, 2024 నుంచి మార్చి 31, 2024 వరకు) నోటిఫై చేసినట్టుగానే యథాతథంగా ఉంచుతున్నాము," అని నోటిఫికేషన్​లో ఉంది.

ఈ పథకాలు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక విరామాలలో గ్యారెంటీ రిటర్నులు అందిస్తాయి. ఈ సాధనాలు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లకు సేవలు చక్కగా ఉపయోగపడత...