భారతదేశం, ఫిబ్రవరి 10 -- భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లోని సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్​లో లేటెస్ట్​ ఎంట్రీ స్కోడా కైలక్. స్కోడా నుంచి ఇండియాలోకి వచ్చిన తొలి సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ఇదే. దీనికి కస్టమర్స్​ నుంచి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కూడా కైలాక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? ఇందులో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది? అని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! స్కోడా కైలాక్​ సిగ్నేచర్​ ప్లస్​.. వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సెకండ్ టు టాప్, స్కోడా కైలాక్​ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్​లో 10 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్, రేర్ సెంటర్ ఆర్మ్​రెస్ట్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయ...