భారతదేశం, జనవరి 27 -- ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో లేటెస్ట్​ ఎంట్రీ అయిన స్కోడా కైలాక్​పై కీలక అప్డేట్​! ఫ్యామిలీ ఎస్​యూవీగా వస్తున్న స్కోడా కైలాక్​ డెలివరీలు సోమవారం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బేస్ స్పెక్ కైలాక్ ధర రూ .7.89 లక్షలు. ఇది సెగ్మెంట్​లోనే అత్యంత సరసమైన ఆప్షన్స్​లో ఒకటి. టాప్ స్పెక్ స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​​ ధర రూ .14.40 లక్షలు. ఇక మాన్యువల్ ట్రాన్స్​మిషన్ వర్షెన్ ధర రూ .13.35 లక్షలు. మిడ్ స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ ధరలు మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్ రూ.9.59 లక్షలు, రూ.11.40 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్ రూ.10.59 లక్షలు, రూ.12.40 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్​షోరూం ధరలను గుర్తుపెట్టుకోవాలి...