భారతదేశం, ఏప్రిల్ 5 -- స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన 'జాక్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే వారం ఏప్రిల్ 10వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ మెప్పించింది. జాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు సిద్ధు, వైష్ణవి. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

తాను ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు వైష్ణవి డైలాగ్ మరిచిపోయేదని, అప్పుడు సరదాగా తనను కొట్టేదని సిద్ధు చెప్పారు. వైష్ణవి మంచి యాక్టర్ అని, ఒకటి రెండు టేక్‍ల్లోనే చాలా సీన్లు చేసినట్టు తెలిపారు.

మంచి నటిలో ఉండాల్సిన లక్షణాలు వైష్ణవిలో ఏమైనా గమనించారా అనే ప్రశ్న సిద్ధుకు ఎదురైంది. దీనికి స్పందించారు. "వైష్ణవి మంచి య...