భారతదేశం, ఫిబ్రవరి 4 -- మహారాష్ట్ర షిర్డీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! సాయిబాబా సంస్థాన్​కు చెందిన ఇద్దరు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు! కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

షిర్డీలో సోమవారం ఈ ఘటన జరిగింది. షిర్డీ సాయిబాబా సంస్థాన్​కి చెందిన ముగ్గరిపో కర్దోబా నగర్​ చౌక్​, సకోరి శివ్​ ఏరియా, ఎయిర్​పోర్ట్​ రోడ్​లలో దాడులు జరిగాయి. ఈ మూడు నేరాలకు పాల్పడింది ఒకరే అని, దొపిడీ కోసం వారు ప్రయత్నించినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మృతులను కర్దోబా నగర్​కు చెందిన సుభాష్ సాహెబ్ రావ్ ఘోడే (43), సకోరి శివ్​కు చెందిన నితిన్ కృష్ణ షెజుల్ (45)గా గుర్తించారు. వీరిద్దరు సాయిబాబా సంస్థాన్ ఉద్యోగులు. శ్రీకృష్ణ నగర్​కు చెందిన కృష్ణ దేహర్కర్ అనే వ్యక్తి ప్రవరనగర్​లోని...