భారతదేశం, ఏప్రిల్ 7 -- ట్రంప్​ టారీఫ్​ భయాలు- చైనా ప్రతిచర్యల మధ్య ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు చితికిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారత స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. ప్రధాన సూచీలతో పాటు అనేక స్టాక్స్​ విపరీతంగా పడ్డాయి.

లేటెస్ట్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్ 3,985​ పాయింట్లు (5.29శాతం) కోల్పోయి 71,380 వద్ద ఓపెన్​ అయ్యిది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 1,146 (5శాతం) పాయింట్లు పడి 21,758 వద్ద సెషన్​ని ప్రారంభించింది.

ఇక ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయంలో సెన్సెక్స్​ 2,739 పాయింట్లు పడి 72,626 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 887 పాయింట్లు కోల్పోయి 22,017 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30లో టాటా మోటార్స్​ 10శాతం, టాటా స్టీల్​ 9.9శాతం మేర నష్టపోయాయి.

బీఎస్ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన...