భారతదేశం, జనవరి 26 -- ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇండియాది కూడా ఇదే కథ! మెజారిటీ కార్ల తయారీ సంస్థలు 2025 జనవరిలో తమ ధరలను సవరించగా, వాటిలో చాలా వరకు ఫిబ్రవరిలోనూ ప్రైజ్​ హైక్​ తీసుకుంటున్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ఫిబ్రవరి నుంచి తమ కార్ల ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. జనవరిలో కూడా ఈ కంపెనీ వాహనాల ధరలు పెరిగాయి.

తాజా ధరల పెంపుతో మారుతీ సుజుకీ డిజైర్ బేస్ వేరియంట్ ధర రూ.27,100, టాప్ ఎండ్ ధర రూ.40,560 పెరగనుంది! మరోవైపు 2024 హోండా అమేజ్ ధరలు కూడా ఫిబ్రవరి నుంచి పెరగనున్నాయి. అమేజ్ ప్రారంభ ధరలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది.

డిజైర్, అమేజ్ సెడాన్​లకు సంబంధించి 2024 లో ఫేస్​లిఫ్...