భారతదేశం, ఫిబ్రవరి 28 -- SEBI chairman: క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ చైర్మన్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఫిబ్రవరి 28, శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సెబీ చైర్మన్ మాదాబీ పూరీ బుచ్ స్థానంలో ఒడిశా కాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత పాండే ను నియమించారు. సెబీ చైర్మన్ పదవికి తుహిన్ పాండే ను నియమించడానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. పాండే బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్ల కాలానికి ఆయన నియామకం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గత కొంత కాలంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) తమ నిధులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. దాంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. భ...