భారతదేశం, అక్టోబర్ 4 -- అమెరికన్ రాపర్, రికార్డు ఎగ్జిక్యూటివ్‌గా పేరుగాంచిన సీన్ 'డిడ్డీ' కాంబ్స్‌కు 50 నెలల జైలు శిక్ష ఖరారైంది. మహిళలపై హింస, రాకెటీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్‌తో పాటు పలు నేరాలకు సంబంధించి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అరుణ్ సుబ్రమణియన్ ఈ తీర్పు ఇచ్చారు.

ప్రస్తుతం అపఖ్యాతి పాలైన ఈ హిప్‌హాప్ దిగ్గజానికి శిక్షను ఖరారు చేస్తూ, జడ్జి సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంబ్స్ మాజీ ప్రేమికురాళ్లు, రిథమ్ అండ్ బ్లూస్ గాయని కసాండ్రా వెంట్యురా, కోర్టులో 'జేన్' అనే మారుపేరుతో పిలవబడిన మరో మహిళ చేసిన ఆరోపణలను న్యాయమూర్తి ప్రస్తావించారు.

"ఇక్కడ జరిగింది కేవలం ఇద్దరి మధ్య అంగీకారంతో కూడిన అనుభవాలు లేదా 'సెక్స్, డ్రగ్స్, రాక్-అండ్-రోల్' కథ మాత్రమేనని నిందితుడి తరపు న్యాయవాదులు చెప్పే ప్రయత్నాన్ని కోర్టు తిరస్కరిస్తోంది," అని న్యాయమూర్తి ...