భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. శుభవార్త చెప్పింది. ఈ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 2, 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాల్లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..

మేనేజర్- డిప్యూటీ మేనేజర్ (ప్రొడక్ట్స్ - డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్): 59 పోస్టులు

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 63 పోస్టులు

1. మేనేజర్- డిప్యూటీ మేనేజర్ (ప్రొడక్ట్స్ - డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్) పోస్టులకు (ఆగస్టు 31, 2025 నాటికి):

అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూన...