భారతదేశం, జూలై 26 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) ప్రిలిమ్స్ పరీక్ష 2025కు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ కాల్ లెటర్లను ఎస్​బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డులను ఆగస్టు 5, 2025 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్​బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 2, ఆగస్టు 4, ఆగస్టు 5, 2025 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్‌లో వెలువడతాయి.

ఎస్​బీఐ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్​బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష 2025కు హాజరు కావడానికి అర్హత పొందుతారు. మెయిన్స్ పరీక...