భారతదేశం, మార్చి 1 -- నిరీక్షణ ముగిసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ బ్లాక్‍బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్‍ విషయంలో నిరీక్షణ ఎక్కువ రోజులు సాగింది. థియేటర్లలో అంచనాలకు మంచి భారీ కలెక్షన్లు, లాంగ్ థియేట్రికల్ రన్ సాధించటంతో ఓటీటీ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేడు (మార్చి 1) ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేటి సాయంత్రం స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో తెలుగులో మాత్రం రిలీజైన ఈ చిత్రం జీ5లో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో టెలికాస్ట్,...