Hyderabad, ఫిబ్రవరి 25 -- Sankranthiki Vasthunam OTT: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి అడుగుపెడుతున్న సినిమాగా నిలవబోతోంది. అయితే అదే సమయంలో ఫ్యాన్స్ ను మరింత నవ్వించడానికి డిలీట్ చేసిన కామెడీ సీన్లు కూడా ఓటీటీలోకి వస్తున్నాయట.

ఈ మధ్య చాలా వరకు సినిమాలు సుదీర్ఘ రన్ టైమ్ తో వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల రన్ టైమ్ ను థియేటర్ల కోసం తగ్గిస్తున్నారు. దీనివల్ల కొన్ని సీన్స్ మిస్సవుతున్నాయి. వాటిని ఓటీటీలోకి తిరిగి చేరుస్తున్నారు. అలా ఈ మధ్యే పుష్ప 2 మూవీ కూడా అదనపు 20 నిమిషాల సీన్లను నెట్‌ఫ్లిక్స్ లో జోడించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ విషయంలోనూ అదే జరుగుతోంది.

థియేటర్లలో మూవీ రన్ టైమ్ తగ్గించడ...