Hyderabad, మార్చి 4 -- Sankranthiki Vasthunam 50 Days: వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాగా.. తాజాగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏకంగా 92 సెంటర్లలో ఇప్పటికీ సినిమా రన్ అవుతుండటం విశేషం.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ ఏడాది టాలీవుడ్ లో అతిపెద్ద హిట్ మూవీ. సంక్రాంతికి వచ్చి రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక గత శనివారం (మార్చి 1) సాయంత్రం జీ5 ఓటీటీతోపాటు జీ తెలుగులోనూ ఒకేసారి డిజిటల్, టీవీ ప్రీమియర్ తో సంచలనం సృష్టించింది. జీ5లో అయితే 12 గంటల్లోనే 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 92 సెంటర్లలో కావడం విశేషం. బాక్సాఫీస్ లెక్కలు త...