భారతదేశం, ఫిబ్రవరి 1 -- Sania Mirza Insta Followers: హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ఈ మధ్యే విడాకులు తీసుకున్న విషయం తెలుసు కదా. అది కూడా షోయబ్ మూడో పెళ్లి చేసుకుంటేగానీ ఈ విషయం అధికారికంగా బయటకు రాలేదు. అయితే ఈ విడాకుల తర్వాత సానియాకు ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెరిగినట్లు గుర్తించారు.

సానియా మీర్జాకు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రస్తుతం (ఫిబ్రవరి 1) ఉన్న ఫాలోవర్ల సంఖ్య 12.9 మిలియన్లు. ఇండియా చూసిన టాప్ టెన్నిస్ ప్లేయర్స్ లో ఒకరిగా ఆమెకు చాలా క్రేజ్ ఉంది. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు ఈ మధ్య విడాకులు ఇచ్చిన తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సడెన్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య వేగంగా పెరిగింది.

గత నెల రోజుల్లోనే సానియా ఫాలోవర్ల స...