భారతదేశం, జనవరి 28 -- కొత్త తరం గెలాక్సీ ఎస్ సిరీస్ మోడళ్లు ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి వచ్చాయి, మరియు చాలా మంది స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ఈ డివైజ్ లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పనితీరు, గెలాక్సీ ఏఐ ఫీచర్లకు ఈ సంవత్సరం శామ్సంగ్ కొన్ని ప్రధాన అప్ గ్రేడ్స్ చేసింది. ఈ సిరీస్ లో ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫస్ట్ రివ్యూని ఇక్కడ చూడండి..

డిజైన్ విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా తక్కువ బరువుతో స్లిమ్ గా ఉంటుంది. తేలికగా, ప్రీమియం లుక్ తో ఆకర్షణీయంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ తన బాక్సీ ప్రొఫైల్ ను కొనసాగించింది. కానీ ఇందులో గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా వలె ఫ్లాట్ అంచులు కాకుండా, కర్వ్డ్ అంచులు ఉన్నాయి. ఇది దాదాపు ప్రతి S24 అల్ట్రా యూజర్ కోరుకునే మరొక ప్రధాన డిజైన్ మార్పు.

డ...