భారతదేశం, ఫిబ్రవరి 9 -- శాంసంగ్ జనవరిలో గెలాక్సీ ఎస్25 సిరీస్​ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. అయితే నెల రోజుల్లోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఎంటర్​ప్రైజ్ ఎడిషన్​ను సంస్థ ప్రకటించింది. ఎంటర్​ప్రైజ్​ ఎడిషన్​ స్మార్ట్​ఫోన్​ని వెల్లడించడానికి కంపెనీ కొన్ని నెలల సమయం తీసుకుంటున్న ఊహాగానాల మధ్య ఈ లాంచ్ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతానికి, శాంసంగ్​ గెలాక్సీ ఎస్25 ఎంటర్​ప్రైజ్​ ఎడిషన్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్లు యూరప్​లో లైవ్​ అయ్యాయి. మీరు ఎంటర్​ప్రైజ్ ఎడిషన్ కోసం వేచి ఉన్నట్లయితే, ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

స్పెసిఫికేషన్ల పరంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఎంటర్​ప్రైజ్ ఎడిషన్ స్టాండర్డ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్​కు సమానమైన ...