భారతదేశం, మార్చి 24 -- ఎంపీలు, మాజీ ఎంపీల జీతాలు, పింఛన్లు, అదనపు పింఛన్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. వీటిని ఈసారి 24శాతం పెంచింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్​ని జారీ చేసింది.

అంతేకాదు, జీతాలతో పాటు సిట్టింగ్​ ఎంపీల రోజువారీ అలొవెన్సులను సైతం కేంద్రం పెంచింది.

1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పార్లమెంటు సభ్యుల జీతం, అలొవెన్సులు, పింఛను చట్టం కింద మంజూరు చేసిన అధికారాలను ఉపయోగించి ఈ వేతన పెంపును నోటిఫై చేసింది కేంద్రం.

తాజా పెంపు 2023 ఏప్రిల్​ 1 నుంచి వర్తిస్తుందని తెలుస్తోంది.

"పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ చట్టం, 1954 (30 ఆఫ్ 1954) లోని సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ (2), సెక్షన్ 8ఎలోని సబ్ సెక్షన్ (1ఎ) ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత...