భారతదేశం, మార్చి 22 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీకి ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. 2023 డిసెంబర్ నెలలో విడుదలైన ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. రూ.700కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ డామినేట్ చేసింది. సలార్ ఫీవర్ అలాగే కొనసాగుతోంది. ఈ చిత్రం చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న సలార్ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 21) థియేటర్లలో రీ-రిలీడైంది. ఇప్పుడు కూడా అదిరే కలెక్షన్లు సొంతం చేసుకుంది.

సలార్ చిత్రానికి రీ-రిలీజ్‍లో తొలి రోజు రూ.3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఎలాంటి స్పెషల్ సందర్భం లేకుండా రీ-రిలీజై ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకుంది. సలార్ మూవీ పరిమిత థియేటర్లలోనే రీ-రిలీజైన ఆక్యుపెన్సీ భారీగా కనిపించింది. దీంతో తొలి రోజు రూ.3.24 క...