భారతదేశం, మార్చి 11 -- శబరిమలకు వెళ్లే అయప్ప భక్తులకు శుభవార్త! భక్తుల చిరకాల కోరికను పరిగణనలోకి తీసుకున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు.. శబరిమలలోని 'దర్శనం' మార్గాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇక నుంచి సన్నిధానంలోని పవిత్ర 18 మెట్లు ఎక్కే భక్తులు నేరుగా దర్శనానికి వెళతారు.

ఈ మార్పును మార్చ్​ 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొత్త మార్గంలో దర్శనం కొనసాగుతుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే వచ్చే మండల-మకరవిలక్కు సీజన్​లో ఈ మార్పును శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు.

18 పవిత్ర మెట్లు ఎక్కిన తర్వాత మెరుగైన దర్శన అనుభవం కోసం మార్గాన్ని మార్చాలని కోరుతూ భక్తుల నుంచి వేలాది లేఖలతో సహా బోర్డుకు అనేక అభ్యర్థనలు వచ్చాయని ఆయన చెప్పారు.

"ప్రస్తుతం పవిత్ర మెట్లు ఎక్కే భక్తులను...