భారతదేశం, మార్చి 14 -- 2025-2026 బడ్జెట్​ లోగోలో.. దేశం ఆమోదించిన 'రూపీ' సింబల్​ని మార్చి సంచలనం సృష్టించింది తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం. సాధారణంగా వినియోగించే ' Rs.' చిహ్నం కాకుండా, దాని స్థానంలో తమిళ అక్షరం 'రు'ని ప్రవేశపెట్టింది. వినియోగంలో ఉన్న రూపీ సింబల్​ లేకుండానే, మార్చ్​ 14న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్​ని ప్రవేశపెట్టనుంది సీఎం స్టాలిన్​ నేతృత్వంలో డీఎంకే. తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య హిందీ భాష, డీలిమిటేషన్​ వంటి అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో రూపీ సింబల్​ని మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ సహా ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు రూపీ సింబల్​ని డీఎంకే తొలగించింది కానీ, వాస్తవానికి ఈ చిహ్నాన్ని డిజైన్​ చేసింది ఆ పార్టీకి చెందిన ఒక నేత కుమారుడే అని మీకు తెలుసా?

2010లో యూపీఏ ప్రభుత్వం హ...