భారతదేశం, మార్చి 24 -- పారామెడికల్ సిబ్బంది నియామక పరీక్షకు సంబంధించిన తాత్కాలిక తేదీల (టెంటెటివ్​ డేట్స్​)ను రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2025 ఏప్రిల్ 28 నుంచి 30 వరకు ఆర్​ఆర్బీ పారామెడికల్​ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరగనుంది.

మరోవైపు ఆర్​ఆర్బీ పారామెడికల్​ పరీక్ష 2025కి సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ అండ్ ట్రావెల్ అథారిటీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే) డౌన్​లోడ్ చేసుకోవడానికి లింక్​ని పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ఇస్తామని అధికారులు తెలిపారు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు ఈ-కాల్ లెటర్లు/ అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.

ఎగ్జామ్​ హాల్లోకి ప్రవేశించే ముందు పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుందని ఆర్ఆర్బీలు తెలిపాయి. అందువల్ల అభ్యర్థులు పరీక్ష రోజ...