భారతదేశం, ఆగస్టు 29 -- గ్రాడ్యుయేషన్​ స్థాయి పోస్టుల కోసం నిర్వహించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల అవ్వలేదు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ తమ ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ నెలలో రిజల్ట్స్​ విడుదల కావని చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో, ముఖ్యంగా రెండో లేదా మూడో వారంలో ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నాయి.

గతంలో ఆగస్ట్​ 26, 2025న ఆర్‌ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ 1 2025 పరీక్ష ఫలితాలను, అలాగే తేదీని చర్చించడానికి ఆర్‌ఆర్బీ అధికారులు ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది.

గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బోర్డు జులై 1న తాత్కాలిక ఆన్సర్ కీని ఇప్పటికే విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తె...