Hyderabad, జనవరి 31 -- Ronaldo 700 Wins: ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో ఓ ఊహకందని రికార్డును క్రియేట్ చేశాడు. అతని సమకాలీనుడైన మరో గ్రేట్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీకి సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. గురువారం (జనవరి 30) రొనాల్డోకు చెందిన అల్-నసర్ టీమ్ 2-1తో అల్ రైద్ టీమ్ ను ఓడించడంతో రొనాల్డో ఖాతాలో 700 క్లబ్ విజయాలు వచ్చి చేరాయి.

పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఈ జనరేషన్లో అతి గొప్ప ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అతడు సాధించిన ఫీట్ రొనాల్డోను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం అల్-నసర్ టీమ్ కు ఆడుతున్న రొనాల్డో 700 క్లబ్ విజయాలు సాధించిన తొలి, ఏకైక ఫుట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం.

రొనాల్డో ఇప్పటి వరకూ స్పోర్టింగ్ తో 13 విజయాలు, రియల్ మాడ్రిడ్ తో 316, మాంచెస్టర్ యునైటెడ్...