Hyderabad, మే 8 -- Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ నటించిన రోమియో మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తెలుగులో ఈ సినిమా లవ్ గురు పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీల్లో తెలుగు వెర్షన్ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

రోమియో మూవీ మొదట ఆహా ఓటీటీలో శుక్రవారం (మే 10) నుంచి స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. అయితే తాజాగా ప్రైమ్ వీడియోలోనూ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్పడం విశేషం. రెండు ఓటీటీల్లోనూ మే 10వ తేదీ నుంచే ఈ సినిమా రానుంది. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆ వెర్షన్ ఎందులో వస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు.

అయితే ఆహా ఓటీటీలోనే తెలుగు వెర్షన్ కూడా వస్తుందని తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ, మృణాలినీ రవి జంటగా నటించిన రోమియో మ...