భారతదేశం, మార్చి 8 -- Romantic OTT: రెజీనా హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ఉత్స‌వం ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా విడుద‌లైంది. ఉత్స‌వం సినిమాలో దిలీప్ ప్ర‌కాష్ హీరోగా న‌టించాడు.

ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, నాజ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అర్జున్ సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఉత్స‌వం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. అంత‌రించిపోతున్న నాట‌క రంగ క‌ళ‌ను బ‌తికించాల‌నే కాన్సెప్ట్‌కు ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు అర్జున్ సాయి ఈ మూవీని తెర‌కెక్కించాడు.మంచి సినిమాగాగా పేరొచ్చిన ఉత్స‌వం క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది.

అభిమ‌న్యు నారాయ‌ణ (ప్ర‌కాష్ రాజ...