భారతదేశం, ఏప్రిల్ 5 -- మలయాళ నటుడు వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఒరు జాతి జాతకం చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మిక్స్డ్ వచ్చింది. కానీ లోబడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి ఎం.మోహనన్ దర్శకత్వం వహించారు. ఒరు జాతి జాతకం చిత్రం ఇటీవలే ఓ ఓటీటీలోకి రాగా.. తాజాగా మరో ప్లాట్‍ఫామ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది.

ఒరు జాతి జాతకం సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ ఇటీవలే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులోకి వచ్చింది. రెండు ఓటీటీల్లో మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఒరు జాతిజాతకం చిత్రంలో వినీత్ శ్రీనివాసన్‍తో పాటు మృధు...