భారతదేశం, మార్చి 3 -- భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్​ అధికార ప్రతినిధి డాక్టర్​ షమా మహమ్మద్​ చేసిన కామెంట్స్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. రోహిత్​ శర్మ లావుగా ఉన్నాడని, బరువు తగ్గాలని ఆమె ట్వీట్​ చేశారు. అంతేకాదు, భారత జట్టు కెప్టెన్​గా ఆకట్టుకోవడంలో రోహిత్​ విఫలమైనట్టు ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​ ప్రతినిధి వ్యాఖ్యలను బీజేపీతో పాటు పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్య చేశారు.

ఈ మ్యాచ్​లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించగా, మహమ్మద్ ఎక్స్​లో రోహిత్ శర్మపై విరుచుకుపడ్డారు. "రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు! బరువు తగ్గాల్సిందే! వాస్తవానికి అతని కెప్టెన్సీ ఆకట్టుకునే...