భారతదేశం, మార్చి 26 -- రాబిన్‍హుడ్ సినిమా విడుదలకు రెడీ అయింది. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ తెలుగు కామెడీ యాక్షన్ మూవీ మరో రెండు రోజుల్లో మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది పండుగ ముందు వచ్చేస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో క్యామియో రోల్ చేయడం మరింత స్పెషల్‍గా ఉంది. రాబిన్‍హుడ్ సినిమాకు అప్పడే ఇంటర్నల్ రిపోర్టులు వచ్చేశాయి. ఈ చిత్రానికి టాక్ ఎలా ఉందంటే..

రాబిన్‍హుడ్ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయింది. దీంతో ఈ మూవీ ఎలా ఉందో సెన్సార్ టాక్ బయటికి వచ్చింది. అలాగే ఇంటర్నల్ టాక్ కూడా వినిపిస్తోంది. రాబిన్‍హుడ్ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉందని తెలుస్తోంది. కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ క...