భారతదేశం, మార్చి 29 -- రాబిన్‍హుడ్ సినిమా మంచి క్రేజ్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 28) థియేటర్లలో విడుదలైంది. నితిన్ - వెంకీ కలిసి గతంలో చేసిన భీష్మ సూపర్ హిట్ కావటంతో వీరి కాంబోలో వచ్చిన రాబిన్‍హుడ్‍పై అంచనాలు పెరిగాయి. వరుసగా వరుసగా ఐదు ప్లాఫ్‍లతో ఉన్న నితిన్‍ను ఈ మూవీ సక్సెస్ ట్రాక్ పట్టిస్తుందనే ఆశలు నెలకొన్నాయి. అయితే, రాబిన్‍హుడ్ చిత్రానికి ఆ రేంజ్‍లో ఓపెనింగ్ దక్కలేదు.

రాబిన్‍హుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దాదాపు రూ.4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. భారీ అంచనాలు ఉన్నా ఓపెనింగ్ డే రోజున రూ.5కోట్లు క్రాస్ కాలేకపోయింది ఈ చిత్రం. అందులోనూ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

రాబిన్‍హుడ్ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.2...