భారతదేశం, జనవరి 26 -- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ కర్తవ్య పథ్​లో ఏర్పాటు చేసిన రిపబ్లిక్​ డే పరేడ్​ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర నేతలు ఈ పరేడ్​లో పాల్గొన్నారు.

అంతకుముందు, జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లిన ప్రధాని మోదీ, అమరవీరులను స్మరించుకుని, 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ.. కాషాయ, ఎరుపు రంగు సఫా, గోధుమ రంగు బంద్​గాలా కోటు, క్రీమ్ కలర్ చుడీదార్ కుర్తా సెట్ ధరించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....