భారతదేశం, జనవరి 26 -- 76వ గణతంత్ర దినోత్సవానికి దేశం ముస్తాబైంది. ఇంకొన్ని గంటల్లో దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. రిపబ్లిక్​ డేని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగాయి. అంతా బాగానే ఉంది కానీ! అసలు జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము? జనవరి 27న ఎందుకు కాదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. చరిత్రలో వెనక్కి వెళ్లాల్సిందే!

1947 ఆగస్ట్​ 15న భారత్​కు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున ఇండిపెండెన్స్​ డే జరుపుకుంటున్నాము. అయితే, 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున రిపబ్లిక్​ డే జరుపుకుంటున్నాము. ఇది తెలిసిన విషయమే.

ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించ...