భారతదేశం, ఫిబ్రవరి 7 -- బడ్జెట్​ 2025 అనంతరం మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్​ న్యూస్​! చాలా కాలంగా అధిక స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను కట్​ చేస్తున్నట్టు ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు కట్​ చేసినట్టు మానిటరీ పాలసీ సమావేశంలో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా వెల్లడించారు.

"మా టార్గెట్స్​కి తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం ఉంది. అందుకే ఈసారి వడ్డీ రేట్లను కట్​ చేసేందుకు ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు," అని ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా తెలిపారు.

ఆర్​బీఐ వడ్డీ రేట్లను కట్​ చేయడం దాదాపు 5ఏళ్లల్లో ఇదే తొలిసారి. తాజా కట్​తో రెపో రేటు 6.5శాతం నుంచి 6.25శాతానికి దిగొచ్చింది. అంతకుముందు వరసుగా 11 ఎంపీసీ సమావేశాల్లో వడ్డీ రేట్లను ఆర్​బీఐ యథాతథంగా...