భారతదేశం, ఫిబ్రవరి 18 -- స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. వరుసగా భారీ సక్సెస్‍లు చూస్తున్నారు. అందంతో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్సులతో మెప్పిస్తూ మరింత క్రేజ్ పెంచేసుకున్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో వరసగా మూడు బ్లాక్‍బస్టర్లను ఈ బ్యూటీ దక్కించుకున్నారు. అందులోనూ ఆ సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన పర్ఫార్మర్ అంటూ రష్మికకు కితాబు దక్కేసింది. ఆ వివరాలు ఇవే..

యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. 2023 డిసెంబర్‌లో రిలీజైన ఆ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. యానిమల్ మూవీలో రష్మిక మందన్నా నటనతో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్లలో వావ్ అనిపించారు. కోపంగా రణ్‍బీర్‌తో చెప్పే లెంతీ డైలాగ్‍లు ...