భారతదేశం, మే 1 -- Ramayana: ఇటీవలి కాలంలో చాలా సినిమాలను లీకుల బెడద ఎదురవుతుంది. షూటింగ్ సమయంలోనే ఫొటోలు, వీడియోలు బయటికి వస్తున్నాయి. ఇది మేకర్లకు ఇబ్బందిగా మారుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణం సినిమాకు ఆరంభంలోనే లీక్‍ల ఇబ్బంది ఎదురైంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలుకాగా.. రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోలు లీక్ అయ్యాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‍బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ మళ్లీ లీక్‍లు జరగకుండా డైరెక్టర్ నితేశ్ తివారీ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

రామాయణం సినిమా మరికొన్ని రోజుల పాటు ఔట్‍డోర్‌లో రాత్రివేళ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. సెట్‍ను చూసేందుకు వచ్చే ఎవరైనా ఫొటోలు తీయకుండా నిఘా వేసేందుకు కొత్తగా ప్రైవేట్ సెక్యూరిట...