Hyderabad, ఫిబ్రవరి 12 -- Ram Charan: రామ్ చరణ్, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను కైఫ్ మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం షేర్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ తో నాటు నాటు స్టెప్పులు వేయాలని ఉందన్న అతడు.. ఆర్ఆర్ఆర్ స్టార్ పై ప్రశంసలు కురిపించాడు. ఐఎస్‌పీఎల్ టీ10 ప్రారంభం సందర్భంగా ఈ ఇద్దరూ కలిశారు.

టీమిండియాలో ఒకప్పుడు మెరుపు ఫీల్డర్ గా, మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్ గా ఎదిగిన మహ్మద్ కైఫ్.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిశాడు. ఈ సందర్భంగా అతనితో దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. "అతన్ని కలిసినప్పుడు అతనితో నాటు నాటు స్టెప్ వేయాలని అనుకుంటారు. ఓ పెద్ద గ్లోబల్ సూపర్ స్టార్ కానీ చాలా సింపుల్ గా ఉంటారు. మా అందరినీ మీరు గర్వపడేలా చేశారు. మీకు మరిన్ని హిట్స్ లభించాలని మనస్ఫూర్త...