భారతదేశం, సెప్టెంబర్ 6 -- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, ఈస్టర్న్ రైల్వే (RRC/ER) క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 10, 2025 (ఉదయం 10:00) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 9, 2025 (సాయంత్రం 6:00) అని గుర్తుపెట్టుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 2025 - జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు (ఫీల్డ్​ ట్రయల్స్​) నిర్వహించే అవకాశం ఉంది.

రైల్వో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

1. విద్యార్హత:

లెవెల్ 4/5: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.

లెవెల్ 2/3: 12వ తరగతి లేదా ద...