భారతదేశం, మార్చి 24 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అనేక రంగాల స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రైల్​టెల్​ స్టాక్​. నేటి ట్రేడింగ్​ సెషన్​లో ఈ రైల్​టెల్​ షేర్లు ఒకానొక దశలో 9శాతానికిపైగా లాభపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 6శాతం జంప్​తో రూ. 328 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి. ఈ స్టాక్​ లాభాలకు కారణం ఏంటంటే..

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.25 కోట్లకు పైగా విలువైన ఆర్డర్ వచ్చిందని కంపెనీ చెప్పడంతో రైల్​టెల్ షేరు ధర సోమవారం లాభాల్లో కొనసాగుతోంది.

"రైల్​టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ .25,15,24,500 /- (పన్ను మినహాయించి)కు వర్క్ ఆర్డర్ పొందింది," అని కంపెనీ మార్చ్​ 23న స్టాక్ ఎక్స్​ఛేంజ్​ ఫైలింగ్​లో స...