భారతదేశం, ఫిబ్రవరి 19 -- పీవీఆర్​-ఐనాక్స్​లో మూవీ వాచింగ్​ ఎక్స్​పీరియెన్స్​ బాగానే ఉంటున్నప్పటికీ, సినిమా ప్రారంభమయ్యే విషయంపై చాలా విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల ఎక్కువసేపు యాడ్స్​ ప్రదర్శించి, సినిమాను.. చెప్పిన టైమ్​ కన్నా చాలా ఆలస్యంగా ప్రారంభిస్తుంటారు. ఇది చాలా మంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అంతేకాదు చాలా సమయం వృథా కూడా అవుతోంది. దీనిని ఓ వ్యక్తి చాలా సీరియస్​గా పరిగణించాడు. "25 నిమిషాల పాటు యాడ్స్​ వేసి, నా సమయాన్ని వృథా చేశారు," అంటూ కేసు వేశాడు. ఈ వ్యవహారంపై బెంగళూరు కన్జ్యూమర్​ కోర్టు పీవీఆర్​ సినిమాస్​- ఐనాక్స్​కి షాక్​ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..

అభిషేక్​ ఎంఆర్​ అనే వ్యక్తి "సామ్​ బహదూర్"​ సినిమా చూసేందుకు 2023లో పీవీఆర్​కి వెళ్లాడు. సినిమా చూసి, అటు నుంచి అటు వర్క్​కి వెళ్లి, ఇతర పనులు పూర్తి చేసుకునే విధంగా ప్లాన్​...