భారతదేశం, మార్చి 19 -- Putin humiliates Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అవమానించారా? అంటే అవుననే స్పందిస్తోంది సోషల్ మీడియా. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు అయితే, ఆ చర్చలకు ముందు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ను గంటకు పైగా వేచి ఉంచారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు, ఆయన బృందం కోరిన ఉక్రెయిన్ లో 30 రోజుల కాల్పుల విరమణ గడువును ఇవ్వడానికి పుతిన్ నిరాకరించారు. అందుకు బదులుగా, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పరిమితం చేయడానికి మాత్రమే పుతిన్ అంగీకరించారు.

ఈ చర్చ సందర్భంగా ట్రంప్ ను పుతిన్ 60 నిమిషాలకు పైగా నిరీక్షించేలా చేశారని, ట్రంప్ ను పుతిన్ అవమానించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత...