భారతదేశం, ఏప్రిల్ 6 -- పుష్ప 2: ది రూల్ సినిమా ఇక టీవీలో హవా చూపేందుకు సిద్ధమవుతోంది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను భారీ కలెక్షన్లతో షేక్ చేసింది. ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఇప్పుడు టీవీ ఛానెళ్లలో ప్రసారానికి వచ్చేస్తోంది. మూడు భాషల్లో ఒకే రోజు పుష్ప 2 టీవీ ప్రీమియర్ కానుంది. ఓ భాషలో ఓ రోజు ఆలస్యంగా అడుగుపెట్టనుంది. డేట్, టైమింగ్స్, ఛానెళ్ల వివరాలు బయటికి వచ్చేశాయి.

పుష్ప 2 సినిమా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 13న వేర్వేరు ఛానెళ్లలో టీవీ ప్రీమియర్ కానుంది. తమిళంలో ఓ రోజు తర్వాత రానుంది. తెలుగులో ఏప్రిల్ 13వ తేదీన స్టార్ మా ఛానెల్‍లో సాయంత్రం 5.30 గంటలకు ఈ చిత్రం టెలికాస్ట్ అవుతుంది. మలయాళంలో ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఏషియానెట్ టీవీ ఛానెల్‍లో టీవీ ప్రీమియర్ అవుతుంది.

ఈ చిత్రం కన్నడలో ఏప...