భారతదేశం, ఫిబ్రవరి 1 -- పుష్ప 2: ది రూల్ సినిమా భారీ బ్లాక్‍బస్టర్‌ కొట్టి అనేక రికార్డులను తిరగరాసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి నుంచి సత్తాచాటి.. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సహా చాలా రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు ఓటీటీలో పుష్ప 2 సినిమా హవా చూపిస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటుతోంది.

పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 1) నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. ఇండియా ట్రెండింగ్‍లో టాప్-1లో పుష్ప 2 సత్తాచాటుతోంది.

జనవరి 30వ తేదీన పుష్ప 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి తెలుగుతో పాటు హిందీ, తమిళం, ...