భారతదేశం, ఫిబ్రవరి 18 -- భారత దేశ లీడింగ్​ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ప్యూర్​ ఈవీ కీలక్​ అప్డేట్​ ఇచ్చింది. జియో ప్లాట్​ఫామ్స్​ లిమిటెడ్​ అనుబంధ సంస్థ అయిన జియోథింగ్స్​ లిమిటెడ్​తో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దీని ప్రకారం.. జియోథింగ్స్​కి సంబంధించిన స్మార్ట్​ డిజిటల్​ క్లస్టర్లు, టెలీమ్యాటిక్స్​ని తమ ఎలక్ట్రిక్​ వాహనాల్లోకి అనుసంధానించనున్నట్టు ప్యూర్​ ఈవీ పేర్కొంది. అధునాతన ఐఓటీ సొల్యూషన్స్​, నిరాటంకమైన కనెక్టివిటీ, సమగ్రమైన డిజిటల్​ అనుసంధానతను ఉపయోగించుకుంటూ తమ కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించమే ఈ భాగస్వామ్య లక్ష్యం అని ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ వెల్లడించింది.

తమ ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాల పనితీరు, ఇంటారాక్టివిటీని మెరుగుపర్చేందుకు ఐఓటీ సొల్యూషన్స్​తో పాటు జియోథింగ్స్​ స్మార్ట్​ డిజిటల్​ క్లస్టర్లను అనుసంధ...