భారతదేశం, జనవరి 25 -- భారత్‌లో ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ తమ X ప్లాట్‌ఫామ్​కి గణనీయమైన అప్‌గ్రేడ్ చేస్తూ.. X ప్లాట్‌ఫామ్​ 3.0ను ప్రకటించింది. వెహికిల్​ పర్ఫార్మెన్స్​, కనెక్టివిటీ, రైడర్ సౌకర్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో అధునాతన ఫీచర్లు పొందుపర్చిన ఈ ప్లాట్​ఫామ్​.. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో వస్తోంది.

X ప్లాట్‌ఫామ్​ 3.0కి సంబంధించిన ప్రత్యేకతల్లో థ్రిల్ మోడ్‌ ఒకటి. ఇది టార్క్‌కు ఊతమిచ్చి, పనితీరును 25శాతం మేర మెరుగుపరుస్తుంది. తద్వారా యూజర్లకు మరింత ఉత్తేజకరమైన రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన పర్ఫార్మెన్స్​లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ డైనమిక్, పవర్​ఫుల్​ డ్రైవ్‌ను కోరుకునే వారి కోసం ఈ ఫీచరు డిజైన్ చేశామని ప్యూర్​ ఈవీ చెబుతోంది.

"X ప్లాట్‌ఫామ్​ 3.0 ఆవిష్కరణతో, అధునాతన ఏఐ ...