భారతదేశం, ఫిబ్రవరి 8 -- ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఈ వీక్‍లో నేడు (ఫిబ్రవరి 8) ప్రపోజ్ డే. అంటే ప్రేమను వ్యక్తపరుచుకునేందుకు ఈ రోజు ప్రత్యేకం. చాలా తెలుగు లవ్ చిత్రాల్లో ప్రపోజల్ సీన్లు చాలా ఫేమస్ అయ్యాయి. ఎన్నో సీన్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఎమోషనల్‍గా, క్యూట్‍గా, రొమాంటి‍క్‍గా అనిపించాయి. ఎన్నో సినిమాల్లోని ప్రపోజల్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. వాటిలో ఐదు ఇవి..

సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' (2009) కమర్షియల్‍గా భారీ సక్సెస్ సాధించకపోయినా.. లవ్ చిత్రాల్లో ఓ క్లాసిక్‍గా పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో ఉదయ్ (సిద్ధార్థ్).. సంధ్య (షామిలీ)కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ ఎంతగానో ఆకట్టుకుంది. సంధ్య పుట్టిన రోజున 12 బహుమతులను ఇస్తూ.. వాటి ప్రత్యేకతలను వివరిస్తూ ఉదయ్ తన ప్రేమను చెప్పే సీన్ అద్భు...