భారతదేశం, ఏప్రిల్ 15 -- మచ్​ అవైటెడ్​ టిగువాన్ ఆర్-లైన్ ఎస్​యూవీని భారతదేశంలో రూ .49 లక్షలకు (ఎక్స్-షోరూమ్- ఇంట్రొడక్టరీ) వోక్స్​వ్యాగన్ ఇండియా విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం జర్మన్ ఆటో తయారీదారు భారత పోర్ట్ఫోలియో నుంచి నిలిపివేసిన మునుపటి వోక్స్​వ్యాగన్ టిగువాన్ స్థానాన్ని ఈ స్పోర్టీ ఎస్​యూవీ భర్తీ చేయనుంది. కొత్త వోక్స్​వ్యాగన్​ టిగువాన్ ఆర్-లైన్ ఎస్​యూవీ అనేక కాస్మెటిక్ అప్డేట్లు, ఫీచర్లతో వస్తుంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా ఇది ఇండియాకు రానుంది. పూర్తి వివరాలు..

వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ జీటీఐతో పాటు వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్​ను విక్రయించనున్నారు. ఈ స్పోర్టీ ప్రీమియం ఎస్​యూవీని వాహన తయారీ సంస్థ అధికారిక వెబ్సైట్​తో పాటు ఫిజికల్ సేల్స్ ఔట్​లెట్స్​లో బుక్ చేసుకోవచ్చు. అయితే, రాబోయే వోక్స్​వ్యాగన్ గోల్ఫ్ జీ...