భారతదేశం, మార్చి 25 -- రిప్లింగ్​ అనే హెచ్​ఆర్​ టెక్​​ కంపెనీ ఫౌండర్​ ప్రసన్న శంకర్​- ఆయన భార్య మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు సోషల్​ మీడియాకు ఎక్కాయి! విడాకులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాగా తన భార్య దివ్య శశిధర్​ చేసిన ఆరోపణలను శంకర్​ సోషల్​ మీడియా వేదికగా తిప్పికొట్టారు. వీరి మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య వారి 9ఏళ్ల కుమారుడు నలిగిపోతున్నాడు.

చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్​.. శాన్​ ఫ్రాన్సిస్కోకు చెందిన రిప్లింగ్​ అనే 10బిలియన్​ డాలర్ల హెచ్​ఆర్​ టెక్​ కంపెనీకి ఫౌండర్​. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎన్ఐటీ తిరుచ్చి) విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రసన్న శంకర్, దివ్య శశిధర్ కలుసుకున్నారు. వీరికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతని సంరక్షణ వారి ...