భారతదేశం, జనవరి 29 -- నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా రెండు చిత్రాల్లో హీరోయిన్‍గా నటించారు ప్రగ్యా జైస్వాల్. బ్లాక్‍బస్టర్ అఖండతో పాటు ఈనెలలోనే వచ్చి సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ మూవీలో బాలయ్యకు జోడీగా కనిపించారు. అయితే, ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని, కలిసి హీరోహీరోయిన్లుగా నటించడం ఏంటి అని కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ స్పందించారు.

2021లో అఖండ తర్వాత మళ్లీ డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించారు ప్రగ్యా. ఆయనతో పని చేసిన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. బాలయ్యతో కలిసి నటించడం స్వచ్ఛమైన ఆనందాన్ని ఇస్తుందని, పాజిటివిటీ అని ప్రగ్యా అన్నారు.

బాలయ్య నుంచి నేర్చుకునేందుకు చాలా ఉందని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. "కెమెరా ఆన్, ఆఫ్ మధ్యలో సులభంగా ఎలా మారొచ్చో ఆయన లాంటి ...